Mana Enadu: యువరాజ్ సింగ్(Yuvaraj singh).. ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరిది. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. 2007లో నిర్వహించిన తొలి T20 World Cupలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు బాల్స్‌కి ఆరు సిక్సులు కొట్టి చుక్కలు చూపించాడు యువీ. అంతేకాదు ఆ ప్రపంచకప్ భారత్ నెగ్గడంలోనూ యువరాజ్ పాత్ర కీలకం. బ్యాటింగ్, బౌలింగ్‌తో సత్తా చాటడంతోపాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టి టీమ్ఇండియాకు తొలి T20 ప్రపంచకప్‌ను అందించాడు. ఆ తర్వాత జరిగిన 2011 ప్రపంచ కప్‌లోనూ ఈ మేటి ఆల్ రౌండర్ విశ్వరూపం చూపించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచక్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో సూపర్‌గా రాణించిన యువీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఆ తర్వాత క్యాన్సర్(Cancer) వ్యాధి బారిన పడి కొంతకాలం క్రికెట్‌కు దూరమైన.. విజయ సంకల్పంతో దానిని జయించాడు. మళ్లీ జట్టులోకి ఎంపికై దాదాపు అన్ని సిరీస్‌ల్లోనూ యూవీ తన శక్తిమేర రాణించి టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ధోనీ అడ్డులేకపోతే నా బిడ్డ మరో నాలుగైదు ఏళ్లు ఆడేవాడు: యోగ్ రాజ్
అయితే తాజాగా యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh) భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ‘‘ యువరాజ్ సింగ్ కెరీర్‌ను MS Dhoni నాశనం చేశాడు. ధోనీని నేనెప్పటికీ క్షమించను. యువీ విషయంలో ధోని తనను తాను అద్దంలో చూసుకోవాలి. అతను గ్రేట్ ప్లేయర్. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. యువీతో కలిసి ధోని ఐదారు ఏళ్లు క్రికెట్ ఆడాడు. కానీ ఎప్పుడు నా కొడుకుకి ధోని మద్దతు ఇవ్వలేదు. నిలువ లేదు. కానీ నా కొడుకు విషయంలో వ్యతిరేకంగా ఉండేవాడు. ఒకవేళ ధోనీ గనుక అడ్డు లేకుంటే నా బిడ్డ మరో నాలుగైదు ఏండ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు. ధోనీనే కాదు నాకు వ్యతిరేకంగా అనిపించిన ఎవరినీ నేను క్షమించను. చివరకు నా ఫ్యామిలీ అయినా సరే. గౌతమ్ గంభీర్(Gambhir), సెహ్వాగ్(Sehwag) కూడా యువీ క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జట్టులోకి రాలేడని అన్నారు. కానీ యువీ దానిని సుసాధ్యం చేశాడు. ప్రాణాంతక వ్యాధితో పోరాడి మరీ భారత్‌కు కీలక విజయాలు అందించాడు. ప్రపంచకప్ సాధించాడు. అందుకు భారత ప్రభుత్వం యువరాజ్ సింగ్‌కు ‘‘భారతరత్న(BHARAT RATNA)’’ ఇవ్వాలి’’ అని యోగ్ రాజ్ అన్నారు.
17 ఏళ్ల పాటు జట్టుకు సేవలు
కాగా 2000లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్(Internationa Cricket)లోకి అడుగుపెట్టాడు. సుమారుగా 17 ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో రాణిస్తూ ఆపద సమయాల్లో నేనున్నానంటూ ఆదుకున్నాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లు, టోర్నీలో రాణించడం అనేది యువీకి వెన్నతో పెట్టిన విద్య. అందరూ తడబడిన చోటే.. అసాధారణ ప్రదర్శన చేస్తాడు. అదే అతడిని అందరి కంటే భిన్నంగా ఉండేలా చేసింది. పరిపూర్ణ క్రికెటర్‌గా మార్చింది. యువీ తన కెరీర్లో టీమ్ ఇండియాకు 402 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 11,178 రన్స్ చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 71 అర్ధశతకాలూ ఉన్నాయి. 2017లో యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు.