Mana Enadu: టీమ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan) జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన రెండో టెస్టులోనూ చెత్త ప్రదర్శన చేసింది. దీంతో తొలిసారి ఆ జట్టు బంగ్లాదేశ్ టీమ్‌పై వైట్ వాష్(White Wash)కు గురైంది. అన్ని విభాగాల్లో సత్తా చాటిన బంగ్లా పాక్‌ను మట్టికరిపించి తొలిసారి పాకిస్ఠాన్‌పై టెస్ట్ సిరీస్(Test Series)ను కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు(Second Test)లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ కుదేల్
రెండో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ అయూబ్ 58, మసూద్ 58, ఆజామ్ 31, సల్మాన్ 54 మినహా మిగతా వారంతా బంగ్లా బౌలర్ల ధాటికి చేతులెత్తేయడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 1st Innings ఆరంభించిన బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ 138, మెహదీ హసన్ 78 రన్స్ చేయడంతో 262 పరుగులకు ఆలౌటై 12 పరుగులు వెనకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 172 పరుగులకే నాలుగో రోజు ఆలౌటైపోయింది. ముందున్న 185 పరుగుల లక్ష్య ఛేదనలో జాకీర్ 40, ఇస్లాం 24, శాంటో 38, మోమినుల్ 34 రన్స్ చేసి ఔటయ్యారు. అనంతరం సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీం (22 నాటౌట్), షకీబల్ హసన్ (21 నాటౌట్) స్లోగా ఆడుతూ రన్స్ రాబట్టారు. మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. అలవోకగా జట్టును గెలుపు తీరం దాటించారు. 6 వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఈ చరిత్రాక్మత(History) గెలుపు తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు(Celebrations) చేసుకున్నారు.
తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో..
ఈ సిరీస్ కైవసం చేసుకొని బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‍పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి ఆ జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది. పాక్ గడ్డపై బంగ్లా గర్జించింది. రావల్పిండి(Ravlpindi)లోనే జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచి బంగ్లా అదరగొట్టింది. రెండో టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్‍లో పాకిస్థాన్‍ను వైట్‍వాష్ చేసింది. గత 1303 రోజుల్లో సొంతగడ్డపై పాకిస్థాన్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలువలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లోనూ ఆ జట్టుకు పరాభవాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది కంగుతింది పాకిస్థాన్ జట్టు. దీంతో ఆ టీమ్‌పై ఆ దేశ అభిమానులు పెద్దయెత్తున విమర్శలు కురిపిస్తున్నారు. సొంతగడ్డ(Home soil )పై బంగ్లా లాంటి జట్టును కూడా ఓడించలేకపోయారని మండిపడుతున్నారు.