Mana Enadu: పారిస్ పారాలింపిక్స్ గేమ్స్ (Paralympic Games 2024) ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గత సీజన్ కంటే ఈసారి భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలు సాధించగా.. మంగళవారం మరో ఐదు పతకాలు కొల్లగొట్టారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో సుమిత్ అంటిల్ వరుసగా రెండోసారి Gold Medal సాధించి, చరిత్ర సృష్టించాడు. ఈటెను 70.59 మీటర్లు త్రో చేసి పారాలింపిక్స్(Paralympics)లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కాగా.. పారిస్ పారాలింపిక్స్-2024 గేమ్స్ ఆగస్టు 28న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 8 వరకూ కొనసాగనున్నాయి. ఈ సారి రికార్డు స్థాయిలో భారత్ నుంచి 84 మంది పారా అథ్లెట్లు(Athletes) ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మొత్తం 12 విభాగాల్లో భారత్(India) పోటీపడుతోంది. కాగా టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics)లో భారత్ అత్యధికంగా 19 పతకాలు సాధించింది. అందులో 5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అయితే ఈసారి రికార్డు స్థాయిలో మన అథ్లెట్లు 20 పతకాలు సాధించారు. ఇప్పటి వరకు జరిగిన పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి. కాగా 1960లో ప్రవేశపెట్టిన పారాలింపిక్ క్రీడల 12 ఎడిషన్లలో పాల్గొన్న భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 19 రజతాలతోపాటు 20 కాంస్యాలతో సహా మొత్తం 51 పతకాలను గెలుచుకుంది.
పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ బంగారు పతకాలు
1. అవని లేఖా – Gold – షూటింగ్- మహిళల 10M ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1
2. నితీష్ కుమార్- Gold – బ్యాడ్మింటన్ – పురుషుల సింగిల్స్ SL3
3. సుమిత్ యాంటిల్ – Gold – అథ్లెటిక్స్- పురుషుల జావెలిన్ త్రో F64
వెండి పతకాలు సాధించింది వీరే..
1. మనీష్ నర్వాల్ – Silver – షూటింగ్ – పురుషుల 10M ఎయిర్ పిస్టల్ SH1
2. నిషాద్ కుమార్ – Silver – అథ్లెటిక్స్- పురుషుల హైజంప్ T47
3. యోగేష్ కథునియా – Silver – అథ్లెటిక్స్ – పురుషుల డిస్కస్ త్రో F56
4. తులసిమతి మురుగేషన్ – Silver – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SU5
5. సుహాస్ యతిరాజ్ – Silver – బ్యాడ్మింటన్ – పురుషుల సింగిల్స్ SL4
6. శరద్ కుమార్ – Silver -అథ్లెటిక్స్- పురుషుల హైజంప్ T63
7. అజీత్ సింగ్ – Silver – అథ్లెటిక్స్ – పురుషుల జావెలిన్ త్రో F46
కాంస్య పతకాలు సాధించింది వీరే..
1. మోనా అగర్వాల్ – Bronz – షూటింగ్ – మహిళల 10M ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1
2. ప్రీతి పాల్- Bronz – అథ్లెటిక్స్- మహిళల 100M T35
3. రుబీనా ఫ్రాన్సిస్ – Bronz- షూటింగ్ – మహిళల 10M ఎయిర్ పిస్టల్ SH1
4. ప్రీతి పాల్- Bronz – అథ్లెటిక్స్ – మహిళల 200మీ T35
5. మనీషా రామదాస్ – Bronz – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SU5
6. రాకేష్ కుమార్ / శీతల్ దేవి – Bronz – విలువిద్య – మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్
7. నిత్య శ్రీ శివన్ – Bronz – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SH6
8. దీప్తి జీవన్‌జీ – Bronz – అథ్లెటిక్స్- మహిళల 400 మీటర్ల T20
9. మరియప్పన్ తంగవేలు – Bronz – అథ్లెటిక్స్- పురుషుల హైజంప్ T63
10. సుందర్ సింగ్ గుర్జార్ – Bronz – అథ్లెటిక్స్- పురుషుల జావెలిన్ త్రో F46