Chiranjeevi’s Vishwambhara Movie Spent 12 Crore For A Single CGI Shot (Video)
Mana Enadu: ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం క్రేజ్, హైప్ తగ్గకుండా వరుసబెట్టి మూవీలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi). గతంలో కంటే రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న చిరు.. ఇప్పటికే వందల కొద్దీ సినిమాలతో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట(Mallidi Vassishta) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వంభర (Vishwambhara)’. సోషియో ఫాంటసీ జోనర్‌లో ఈ మూవీని UV క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్(Shooting) షర వేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష(Trisha) నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ఐదుగురు చెల్లెల్లు ఉంటారని టీటౌన్(TTown)లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
డిఫరెంట్ కాన్సెప్టుతో..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా ‘విశ్వంభర’ను చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ‘విశ్వంభర’ మూవీకి పాన్ ఇండియా(PanIndia) రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో ఊహించని అంశాలను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్(Crazy News) లీకైంది. ఈ సమాచారం ప్రకారం ఇందులో ఏలియన్స్ సీక్వెన్స్ ఒకటి హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన నటీనటులపై కీలకమైన సీన్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

అదిరిపోయేలా వీఎఫ్‌ఎక్స్
ఇదిలా ఉండగా ‘విశ్వంభర’ సినిమాలో ఓ సందర్భంలో వచ్చే VFX సీన్ అదిరిపోయేలా ఉంటుందట. దాదాపు 15 నిమిషాల పాటు ఉండే ఈ Episode కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్(Tollywood)లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీలో అశికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్రలు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10(January 10, 2025) తేదీన విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం స్టార్ టెక్నీషియన్లను కూడా తీసుకొచ్చారట. ఇలా ఇప్పుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence)ను రంగంలోకి దించినట్లు తెలిసింది.






