మన ఈనాడు:
మోస్రా@ 51శక్తిపీఠాలు..అంబారాన్నింటిన శోభాయాత్ర
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఈసారి దేవినవరత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాభవాని యువజన సంఘం 25ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుంది. దీంతో దుర్గామాత అమ్మవారు ప్రపంచంలో భక్తులకు దర్శనమిచ్చే 51రుపాల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు అందించారు.
నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారి శక్తిపీఠాలు దర్శనం చేసుకునేందుకు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. మారుతి పంతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు హామం వంటి పూజలు చేశారు.
ఘనంగా శోభాయాత్ర:
బుధవారం ఉదయం నుం
చి రాత్రి పొద్దుపోయే వరకు 51శక్తి పీఠాల శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. 51ట్రాక్టర్లులో నృత్యాలు,ఆధ్మాత్మిక పాటల నడుమ అమ్మవారి ఊరేగింపుతో మోస్రా గ్రామం పులకరించపోయింది. భాసర గోదావరి నది తీరాన అమ్మవారు హరతులు అందుకోని నిమజ్జన కార్యక్రమం ఘనంగా ముగించారు.