ఆది సాయికుమార్ (Aadi saikumar) మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఆది నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ (shambala) టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు వాటిని మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పతనం అంటుంది’’ అనే సంభాషణలతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అర్చన అయ్యర్ కథానాయిక. నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం అందిస్తున్నారు.






