తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి వాడివాసల్ (Vaadivaasal). గతేడాది వచ్చిన కంగువతోపాటు ఈ మధ్య విడుదలైన రెట్రో (Retro) సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వం వహిస్తున్న వాడివాసల్పై ఆయనతోపాటు అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇప్పడు అభిమానులకు షాక్ తగిలే వార్త వినిపిస్తోంది. వాడివాసల్ నుంచి సూర్య తప్పుకున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.
బౌండరీ స్క్ట్రిప్ట్ తో రాకపోవడంతో..
సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రకటించాడు. మూడేళ్ళుగా వెట్రిమారన్ ఈ సినిమా కోసం సూర్యను వెయిట్ చేయిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు వెట్రిమారన్ బౌండరీ స్క్ట్రిప్ట్ తో రాలేదని, దీంతో ఓపిక నశించి సూర్య వాడివాసల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకుల్లా డబుల్ రోల్లో పోషించాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై..
కానీ ఇప్పటివరకు ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లలేదు. దీంతో సూర్య సినిమా నుంచి తప్పుకోక తప్పలేదని సమాచారం. ప్రస్తుతం సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ మధ్యే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.






