మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), బాలీవుడ్ స్టార్ యాక్టర్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) విడాకుల తీసుకుంటున్నారంటూ ఇటీవల రూమర్స్(Divorce Romours) తెగ ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఐశ్వర్య ఫ్యామిలీకి సంబంధించి మరో కొత్త రూమర్ సోషల్ మీడియా(SM)లో చక్కర్లుకొడుతోంది. దీంతో ఈ విషయాన్ని ఈసారి బచ్చన్ ఫ్యామిలీ కాస్త సిరీయస్‌గానే తీసుకుంది. తమపై తప్పుడు కంటెంట్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా, వెబ్‌సైట్స్(Websites), న్యూస్ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించింది. ఇంతకీ తాజా రూమర్స్ ఏంటంటే..
ఆమె ఆరోగ్యంపై లేనిపోని కథనాలు
అభిషేక్-ఐశ్వర్యల గారాలపట్టీ ఆరాధ్య(Aaradhya)పై 2023లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె ఆరోగ్యం(Health)పై లేనిపోని కథనాలను ప్రచురించాయి. ‘ఆరాధ్య(Aaradhya) ఇక లేరు’ అనేలా యూట్యూబ్ ఛానళ్లు(YouTube channels) ప్రచారం చేశాయి. అలాగే బచ్చన్ ఫ్యామిలీ ఫొటోల(Photos)ను మార్ఫింగ్ చేసి.. విడుదల చేసిన వీడియోలపై బచ్చన్ ఫ్యామిలీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, బచ్చన్ ఫ్యామిలీ సదురు ఛానళ్లపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి. హరి శంకర్.. వెంటనే ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రచారం చేసిన వీడియోల(Videos)ను తొలగించాలని ఆదేశించారు. కోర్టు తీర్పునిచ్చినా.. ఇంకా కొన్ని వీడియోలు దర్శనమిస్తుండటంతో.. మరోసారి ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) Delhi హైకోర్టును ఆశ్రయించారు.
తప్పుడు వార్తలు, వీడియోలు SMలో పెట్టొద్దు: కోర్టు
ఈనేపథ్యంలోనే ‘బాలీ పకోడా’, ‘బాలీ సమోసా’, ‘బాలీవుడ్ షైన్’ లాంటి యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా కోర్టు సమన్లు పంపింది. ఆరాధ్య గురించి తప్పుడు వీడియోలు పెట్టి పరువు తీస్తున్నారని ఆమె వేసిన పిటిషన్‌పై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని, ఇకపై ఇలా జరగకుండా చూడాలని కోర్టు తేల్చి చెప్పింది. బచ్చన్ ఫ్యామిలీ పేరుకు ఒక బ్రాండ్ ఇమేజ్(Brand image) ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు గూగుల్(Google), బాలీవుడ్ టైమ్స్ సహా ఇతర సంస్థలకు లీగల్ నోటీసులు(Legal notices) అందాయి. ఈ కేసు తదుపరి విచారణ 2025, మార్చి 17న జరగనుంది.








