లవ్ స్టోరీస్ తోపాటు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అప్పట్లో ప్రేక్షకులను అలరించారు సీనియర్ నడుటు అబ్బాస్ (Abbas). ప్రేమదేశం, రాజహంస లాంటి ప్రేమ కథలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే పలు కారణాలతో సినిమాలకు దూరమైన ఆయన పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ హీరో, మ్యూజిక డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV prakash) నటిస్తున్న కొత్త మూవీలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన రాజా ఈ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నారు.

కామెడీ, కుటుంబ కథా సినిమాతో..
బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్థనన్ నిర్మిస్తున్నారు. తెలుగు బ్యూటీ శ్రీగౌరి ప్రియ హీరోయిన్. కామెడీ, కుటుంబ కథా సినిమాగా తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది. 1990–2000 మధ్యకాలంలో పాపులర్‌గా హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రకటించారు. 2015లో మలయాళ మూవీ ‘పచ్చ కల్లం’ సినిమా చేసిన తర్వాత అబ్బాస్ సినిమాలకు దూరమయ్యారు. పదేళ్లు గ్యాప్ తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అప్పట్లో అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అబ్బాస్ హెయిర్ కట్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్.






