టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil) సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. మెగా స్టార్ రామ్ చరణ్(Ram Charan) నిర్మాణంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది ఇండియా హౌస్(The Indian House)’ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ మూవీ షూటింగ్‌లో భారీ ప్రమాదం(Accident) తప్పింది. షూటింగ్లో భాగంగా సముద్రం సీన్స్(Sea scenes) తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదమయంగా మారింది. నీళ్ల వేగానికి లొకేషన్‌లో ఉన్న సిబ్బందితో కెమెరాలు, ఇతర వస్తువులు కొట్టుకువచ్చాయి. దీంతో సెట్‌లో ఉన్న కొంత మంది సిబ్బందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇందులో అసిస్టెంట్ కెమెరామెన్(Assistant Cameraman)కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వాటర్ ట్యాంక్(Water Tank) పగిలిపోవడంతో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లినట్లు సమాచారం. శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్‌లో ఈ ఘటన సంభవించింది. ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది.
హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం
ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన
శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద
అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు https://t.co/x98xY5eaKE pic.twitter.com/yLewxQTiQ7
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025






