ప్రస్తుతం OTTల ట్రెండ్ నడుస్తోంది. ఎంత చిన్న సినిమా అయినా.. ఎంత బడా చిత్రమైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలైతే ఏకంగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. రూ. కోట్లు వెచ్చించి మరీ సినిమాలు తీసి, థియేటర్లలోకి వదిలితే పట్టుమని పది, పదిహేను రోజులకే ఆదరణ కోల్పోయి అభిమానులు కరువవుతున్నారు. దీంతో ఆయా నిర్మాతలు ఓటీటీలకేసి చూస్తున్నారు. ప్రస్తుతం రూల్ ప్రకారం ఏ సినిమా అయినా దాదాపు 4 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇటీవల పరిస్థితి చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు.

ఆల్ టైమ్ డిజాస్టర్స్‌లో ఒకటిగా..
సరిగ్గా అలాంటి కోవలోకే చెందుతున్న థగ్ లైఫ్(Thug Life) మూవీ. మణిరత్నం, ప్రముఖ నటులు కమల్-శింబు(Kamal Haasan-Simbu) కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లో రిలీజై అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు కమల్ కర్ణాటకలో చేసిన భాషా వివాదం కూడా సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక రకంగా చెప్పాలంటే కమల్ సినిమాలలో అట్టర్ ఫ్లాప్ అనే కంటే, ఆల్ టైమ్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుందన్న న్యూస్ వైరల్ అవుతోంది.

అనుకున్న టైమ్ కంటే ముందే..
తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) రిలీజ్ చేసిన ఈ సినిమా అతడికి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడీ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. నెట్ ఫ్లిక్స్(Netflix) ఈ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసింది. 8 వారాల లాక్ ఇన్ పీరియడ్ కింద రైట్స్ అమ్మిన నిర్మాతలు, ఇప్పుడు 3 వారాలకే సినిమాను ఓటీటీకి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీని వల్ల నాన్-థియేట్రికల్ ఇన్కమ్ ఇంకాస్త పెరుగనుంది.
#Netflix karan serupala adicha moment as they canceled the 8 week window period for the ott period due to poor response 🤣
Inda karumata dan #ThugLifeBlockbuster nu solringala da dey komalis 🤡#ThugLife 🤡#KamalHaasan #Manirathnam#ThugLifeDisaster #ThugLifeReview pic.twitter.com/PbwdpAO84o— The Eagle Squad🦅 (@wasirajinifan) June 11, 2025






