
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది. తనపై నమోదైన 5 కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Petition)పై కోర్టు గురువారం విచారించింది. CM చంద్రబాబు, Dy.Cm సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 17కిపైగా కేసులు
అదేవిధంగా పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్(PT Warrant) అమలైనందున పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పాతపట్నం, అనంతపురం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17కు పైగా కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా జైలులో పోసాని
అనంతరం రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలు(Rajampet Sub Jail)కు తరలించారు. నరసరావుపేట పోలీసులు PT వారెంట్‌తో పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా జైలు(Kurnool District Jail)లో ఉన్నారు.