టాలీవుడ్ లో ఈమధ్య హీరోల బౌన్సర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది హీరోల బౌన్సర్లు అత్యుత్సాహం చూపించడం ఇటీవల పలుమార్లు మనం చూశాం. ఇక సంధ్య థియేటర్ ఘటనలో (Sandhya Theatre Case)నూ బౌన్సర్ల అత్యుత్సాహం పరోక్షంగా ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో కూడా చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ బౌన్సర్ల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశాడు.
ఇలా ఉన్నారేంట్రా..
తాజాగా బౌన్సర్ల తీరుపై బ్రహ్మాజీ కౌంటర్లు వేశాడు. వీళ్ల ఓవరాక్షన్ చూస్తుంటే మా యాక్షన్ కూడా సరిపోవడం లేదు.. ఏం చేద్దామంటారు.. ఔట్ డోర్స్ కు వెళ్లినప్పుడు ఓకే.. మరీ సెట్స్ లో కూడానా? అంటూ బ్రహ్మాజీ (actor brahmaji) చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసి సెట్స్‌లోనే బౌన్సర్లతో బ్రహ్మాజీకి కాస్త అసౌకర్యం కలిగినట్టుగా ఉందనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. అసలు బౌన్సర్లు ఎందుకు అలా ఉంటున్నారు? మీరు హీరోలకు, నిర్మాతలకు సలహాలు ఇవ్వొచ్చు కదా? అంటూ మరికొంతమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఎక్కడ చూసిన bourncers .. బౌన్సర్లు ..వాళ్ళ overaction ముందు మా action సరిపోవటలేదు .. వాట్ to do ;(
— Brahmaji (@actorbrahmaji) January 6, 2025
బౌనర్స హడావుడితో నటులకూ ఇబ్బందులే
ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా బౌన్సర్ల తీరుపై విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులను బౌన్సర్లు అడ్డుకోవడంపై సీఎం రేవంత్ (CM Revanth Reddy) తీవ్రంగా ఫైర్ అయ్యారు. బౌన్సర్లకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.స్టార్ హీరోల చుట్టూ ఈ బౌన్సర్లు చేసే నానా హంగామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఈవెంట్ కు పెద్ద హీరో వస్తున్నాడంటే వీరి హడావుడే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు.. బ్రహ్మాజీ ట్వీట్ చూస్తుంటే.. ఈ సమస్య ఇతర నటులను కూడా ఇబ్బంది పెడుతున్నట్లు అర్థమవుతోంది.
Out doors okay.. sets lo koodana 🥹..
— Brahmaji (@actorbrahmaji) January 6, 2025







