Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో మరో హీరో!.. 21 ఏళ్ల తర్వాత ఆ కాంబో రిపీట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న సినిమా ‘స్పిరిట్ (Spirit)’. ఉగాది పర్వదినాన ఈ సినిమా పూజా కార్యక్రమం ఉంటుందని అంతా భావించారు. కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు.. కానీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా వార్తలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..?

Image

21 ఏళ్ల తర్వాత ఆ కాంబో రిపీట్

ప్రభాస్ స్పిరిట్ మూవీలో మరో హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగు నటుడు, ప్రభాస్ కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, గోపిచంద్ (Gopichand) ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరు కలిసి గతంలో వర్షం (Varsham) సినిమాలో నటించారు. అయితే అందులో ప్రభాస్ హీరో కాగా.. గోపిచంద్ విలన్. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ కాంబో మరోసారి తెరపై కనువిందు చేయనుందట. అయితే గోపిచంద్ పాత్ర గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Image

సందీప్ రెడ్డి హీరోలంటే..

ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే సందీప్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. సాధారణంగా సందీప్ రెడ్డి హీరోలంటేనే చాలా వైలెంట్ గా ఉంటారు. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) సినిమాల్లో హీరోలను చూశారు కదా ఎంత వైలెంటో. ఇక ఆ హీరో పోలీసు అయితే ఏ రేంజులో ఉంటుందో.. అదీ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఇంకా ఏ రేంజులో ఉంటుందో.. సందీప్ రెడ్డి డార్లింగ్ ను ఎలాంటి అవతార్ లో చూపించబోతున్నాడో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *