Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా సినిమా వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ మేకర్స్ మాత్రం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. ఇటీవల ఇదే విషయంపై ఓ నెటిజన్ డైరెక్టర్ మారుతిని అడిగితే.. త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు.

రాజాసాబ్ హై అలర్ట్

అయితే తాజాగా డైరెక్టర్ మారుతి (Director Maruthi) డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. డిఫరెంట్ స్టైల్ లో ది రాజాసాబ్ మూవీ అప్డేట్ గురించి ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ స్వీట్ న్యూస్ చెప్పారు మారుతి. ఓ ఆటో వెనక ప్రభాస్ స్టిక్కర్ ఉన్న ఫొటో షేర్ చేసిన మారుతి..  ‘‘హై అలర్ట్‌. మే నెల మధ్యలో నుంచి వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘రాజా సాబ్‌’ మూవీ అప్‌డేట్‌ గురించి ఆయన చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీ

ప్రభాస్ సినిమా కెరీర్ లోనే రాజాసాబ్ మూవీ చాలా స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా డార్లింగ్ హారర్ కామెడీ జానర్ లో మూవీ చేస్తున్నాడు. ఇక మారుతి ఈ జానర్ లో దిట్ట అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ది కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ కీల్ రోల్ లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *