బాలీవుడ్(Bollywood) ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. తెలుగులో ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్ దేవ్(Rahul Dev) సోదరుడే ముకుల్ దేవ్ (Mukul Dev).
తెలుగులో ఈ సినిమాల్లో నటించారు..
కాగా, సీరియల్ నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టిన ముకుల్ పలు హిందీ సినిమాల్లో(Hindi Movies) నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దస్తక్’తో నటుడిగా వెండితెరకు పరిచమైన ఆయన బాలీవుడ్(Bollywood)లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’తో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ‘కేడీ’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’, ఏక్ నిరంజన్, బెజవాడ చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘Anth The End’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.
Renowned #Bollywood actor Mukul Dev, has passed away at the age of 54. His untimely demise is a profound loss to the Indian film industry.I first saw him in Movie “Dastak” Alongside sushmita sen since then I was following his work.R.I.P. 🙏#Mukuldev pic.twitter.com/x1oATi4otf
— CricketStats (@CricketStats45) May 24, 2025






