టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin), బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కీలక పాత్రలో నటిస్తున్నాడు. మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే నితిన్, వెంకీ, శ్రీలీల పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఎంత పాజిటివ్ టాక్ ఉందో ఇందులో ఓ పాట విషయంలో ఈ మూవీ విమర్శలు ఎదుర్కొంటోంది.
రాబిన్ హుడ్ కాంట్రవర్సీ
రాబిన్ హుడ్ (Robin Hood) సినిమాలో కేతిక శర్మ (Kethika Sharma) అదిదా సర్ ప్రైజు అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఈ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో విమర్శలు కూడా అంతే రేంజులో వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ తో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల విషయంలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆ స్టెప్పులు చాలా వల్గర్ గా ఉన్నాయంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో నితిన్ కు ఈ కాంట్రవర్సీపై ప్రశ్న ఎదురైంది. మరి దానికి నితిన్ ఏం సమాధానం ఇచ్చాడంటే.. ?
నాకు తెలియకుండా జరిగింది
“అదిదా సర్ ప్రైజు (Adhi Dha Surprisu) పాట షూట్ జరుగుతున్నప్పుడు నేను సెట్ లో లేను. ఆ సాంగ్ షూటింగ్ నేను లేకుండా.. నాకు తెలియకుండా జరిగింది. అయినా సరే దానికి మా టీమ్ అంతా బాధ్యత తీసుకుంటాం. ప్రశంసలు ఎలా తీసుకున్నామో విమర్శలు కూడా సమానంగా తీసుకుంటాం. అయితే సినిమా బాగా వచ్చిందని, పాటకు కూడా క్రేజ్ వస్తుండటంతో ఆ స్టెప్పుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ట్రోల్స్ వచ్చిన తర్వాతే వాటిని నేను పరిశీలించారు. ఏదేమైనా అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని నితిన్ చెప్పుకొచ్చాడు.






