తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి(Bahubali)’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన 10 సంవత్సరాల సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic)’ పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్ కానుంది. ఈసారి ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్(Baahubali: The Conclusion)’ రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రన్ టైమ్(Run Time) విషయంలో సోషల్ మీడియా(SM)లో జోరుగా చర్చ సాగుతోంది.
రెండు ఇంటర్వెల్స్ అవసరం కావచ్చొంటూ కామెంట్స్
ఇదిలా ఉండగా ఫస్ట్ పార్ట్ (2 గంటల 38 నిమిషాలు), సెకండ్ పార్ట్ (2 గంటల 47 నిమిషాలు) కలిపితే సుమారు 5 గంటల 25 నిమిషాల రన్ టైమ్ వస్తుందని సమాచారం. అయితే మేకర్స్ ఈ నిడివిని 4 గంటల లోపు తగ్గించే ప్రయత్నంలో ఉంది. కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి, గతంలో తొలగించిన సీన్లను జోడించి సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రీరిలీజ్(Rerelease)లో కొత్త సీన్లు, మెరుగైన విజువల్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభవం అందనుంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh babu)తో చేస్తున్న సినిమా షెడ్యూల్ గ్యాప్‌లో ఎడిటింగ్‌పై దృష్టి సారించారు. అభిమానులు ఈ భారీ నిడివిని ఆస్వాదించడానికి రెండు ఇంటర్వెల్స్ అవసరం కావచ్చని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు: రానా
తాజాగా దీనిపై నటుడు రానా (Rana Daggubati) స్పందించారు. ‘బాహుబలి’ సినిమాలో భల్లాల దేవ(Bhallala Deva) పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు రానా. తాజాగా ఆయన ఈ సినిమా రన్‌టైమ్‌పై స్పందిస్తూ.. ‘‘ఎంత నిడివి ఉన్నా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించకుండానే నాకు బ్లాక్‌బస్టర్ రానుంది. రన్‌టైమ్ ఎంతనేది నాకు కూడా చెప్పలేదు. నాలుగు గంటలు అని పోస్ట్‌లు పెడుతున్నారు. అంత నిడివి ఉంటే చూస్తారా!. దీని నిడివి కేవలం రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు’’ అని అన్నారు.
Mark the Date Bahubali- The Epic on oct 31st 🔥#BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/JQc6NRcmA3
— Meet Prabhas (@MeetPrabhas_) July 15, 2025






