
టాలీవుడ్ హల్క్ రానా (Rana), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు గురించి తెలిసిందే. 2024లో వచ్చిన ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్ కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్ అప్డేట్ ను రానా షేర్ చేశాడు. తన నిర్మాణ సంస్థలో వస్తున్న ఇట్స్ కాంప్లికేటడ్ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఈ అప్డేట్ పంచుకున్నారు.
రానా నాయుడు-2 ట్రైలర్
రానా నాయుడు-2 (Rana Naidu-2)కు సంబంధించిన ట్రైలర్ రెడీ అయిందని, ఈ సిరీస్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని రానా తెలిపారు. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వస్తుందని వెల్లడించారు. ఇక ఈ సిరీస్ సంగతికి వస్తే.. హాలీవుడ్ వెబ్సరీస్ ‘రే డొనోవన్ (ray donovan)’ ఆధారంగా ఇండియన్ నేటివిటికి తగ్గట్లుగా దీన్ని రూపొందించారు. సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ డైరెక్ట్ర్లుగా వ్యవహించారు.
డిజిటల్ తెరపై వెంకీ ఎంట్రీ
చాలా ఏళ్లుగా సినిమాలకే పరిమితమైన విక్టరీ వెంకటేశ్ ‘రానా నాయుడు’ సిరీస్ తో తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సిరీస్ లో వెంకీని నెవ్వర్ బిఫోర్ అవతార్ లో ప్రేక్షకులు చూశారు. మరోవైపు రానా తన నటనతో అభిమానుల అంచనాలు బీట్ చేశాడు. ఇండియాలో ఎక్కువ వ్యూస్ పొందిన సిరీస్‌గా రానా నాయుడు రికార్డుకెక్కింది.