ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు.. నటుడి సంచలన కామెంట్స్

“సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగించే వారు చాలా మంది ఉన్నారు. అయినా ప్రతిసారి నా పేరే తెరపైకి వస్తోంది. నన్నే టార్గెట్ చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకు కొందరు మధ్యవర్తులు ఉంటారు. వాళ్ల నుంచే నాకు మత్తు పదార్థాలు వచ్చేవి. అడిగితే వాళ్లే సినిమా సెట్ కూ తీసుకువచ్చేవారు.” అని మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) చెప్పినట్లు వార్తాకథనాలు వచ్చాయి. డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఆయన శనివారం రోజున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

అవి అప్పుగా ఇచ్చాను

అయితే పోలీసుల విచారణలో నటుడు (Shine Tom Chacko Arrested) పలు కీలక విషయాలు వెల్లడించినట్లు మాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక పోలీసులు విచారణలో భాగంగా ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. మరోవైపు బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా చిన్న మొత్తాల్లో వేర్వేరు వ్యక్తులకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై నటుడిని ప్రశ్నించగా.. అవన్నీ అప్పుగా ఇచ్చానని పోలీసులు తెలిపినట్లు తెలిసింది. ఇక ఇటీవల కొచ్చిలోని హోటల్ నుంచి పరారైన విషయం గురించి ప్రశ్నించగా తనకు తెలిసిన అమ్మాయిని కలవడం కోసమే అక్కడికి వెళ్లినట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం.

ఎందుకు పరారయ్యారు

అయితే ఎందుకు కిటిలో (Shine Tom Chacko Fled From Hotel) నుంచి దూకి వెళ్లారని పోలీసులు ప్రశ్నించగా..  ఓ సినిమా విషయంలో మేకర్స్ తో విభేదాలు వచ్చాయని.. వారే తనతో గొడవపడేందుకు హోటల్‌కు వచ్చారని భావించి తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు షైన్ టామ్ చాకో వివరించినట్లు తెలిసింది. ఇక ఇటీవల మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌ చేసిన ఆరోపణలపైనా నటుడు స్పందిస్తూ.. ఆమె ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేసినట్లు తెలిసింది. ఆమెతో తాను అభ్యంతరకరంగా ప్రవర్తించలేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *