SJ Surya: ఎస్.జే. సూర్య పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మొదలు పెట్టాడుగా.. ఇక రచ్చ రచ్చే!

ఎస్.జే సూర్య (S.J. Surya).. తెలుగు సినిమాల్లో డైరెక్టర్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం “ఖుషి(Kushi)” (2001), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), భూమిక చావ్లా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత “నాని” (2004) చిత్రాన్ని మహేశ్ బాబు(Mahesh Babu), అమీషా పటేల్‌లతో దర్శకత్వం వహించారు, ఇది సైన్స్ ఫిక్షన్ కామెడీగా మిశ్రమ స్పందన పొందింది. దర్శకుడిగా “పులి(Puli)” (2010) చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించారు, అయితే ఇది విజయం సాధించలేదు. మరోవైపు ఆయన నటుడిగానూ పలు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు.

మల్టీ టాలెండటెడ్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు

ఆయన “స్పైడర్” (2017)లో మహేశ్ బాబుతో కలిసి విలన్‌గా నటించి, ‘విజయ్ అవార్డ్‌(Vijay Award)’ను గెలుచుకున్నారు. ఇటీవల “సరిపోదా శనివారం” (2024)లో నాని(Nani)తో కలిసి నటించిన మావెరిక్ కాప్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan)”గేమ్ ఛేంజర్” (2025)లోనూ విలన్ క్యారెక్టర్‌లో ఆకట్టుకన్నారు. ఇలా యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, మల్టీ టాలెండటెడ్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్.జె. సూర్య.

భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు

తాజాగా పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుని(Director)గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈయన రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్(Killer)’. ఇందులో SJ సూర్య హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్‌తో కలిసి సూర్య తన సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియెస్‌పై నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా ఐదు భాషలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని(Preeti Asrani)ని హీరోయిన్‌గా ఎంపిక చేశారట మేకర్స్. ఇప్పటికే చర్చలు జరపగా.. దాదాపు ఓకే అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో షూటింగ్ జరగనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *