నటుడు శ్రీరామ్ (Actor Sriram)కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ (Srikanth) అలియాస్ శ్రీరామ్ (Sriram)ను చెన్నై పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు 8 గంటల సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం చెన్నై కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి జులై 7వ తేదీ వరకు (14 రోజులు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లో ప్రమేయం శ్రీరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ
ఏఐడీఎంకే (AIADMK) మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఓ బార్‌లో గత నెల జరిగిన గొడవకు సంబంధించి అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్ వాండైయార్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. దీంతో శ్రీరాం డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. ఓ వ్యక్తి నుంచి కొకైన్ కొనుగోలు చేశారని, దానికి సంబంధించి నగదును ఆన్‌లైన్‌లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నుంగంబాక్కం పోలీసులు సోమవారం శ్రీకాంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా.. డ్రగ్స్ వాడినట్లు నిర్ధరణ అయ్యింది. దాంతో నటుడిని అరెస్ట్ చేశారు.
తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లి..
ఆంధ్రప్రదేశలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్ (Sriram)గా మార్చుకుని, తొలుత చిన్న పాత్రలు పోషించారు. ‘రోజా పూలు(Roja poolu)’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు.






