Post Office Scheme: టెన్షన్ అవసరమే లేదు.. నెలనెలా అకౌంట్ లోకి ఉచితంగా డబ్బు

డబ్బు సంపాదించడమే కాదు పెట్టుబడి పెట్టి దానిపై అద్భుతమైన రిటర్న్స్ రాబట్టడమే అసలైన విజయం. ఈ రోజుల్లో పెట్టుబడి చేసేందుకు మార్కెట్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, నష్టాల భయం లేకుండా సురక్షితంగా డబ్బును పెంచుకోవాలనుకునే వారికోసం పోస్టాఫీస్ నుంచి వచ్చే ఓ మంచి స్కీమ్ ఉంది.

ఆ స్కీమ్ పేరు: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme – POMIS).

ఈ పథకం ద్వారా మీ డబ్బు పూర్తి సురక్షితంగా ఉండటం కాకుండా, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చొనే ఆదాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. భార్యాభర్తల పేర్లపై జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువగా లాభం పొందొచ్చు.

ఈ స్కీమ్‌లో ముఖ్యాంశాలు:

సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి చేయవచ్చు.

జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4% వార్షిక వడ్డీ లభిస్తోంది.

మీరు వేసిన పెట్టుబడిపై, ప్రతి నెలా రూ. 9250 వరకు స్థిరమైన ఆదాయం వస్తుంది.

మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.

మెచ్యూరిటీ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్‌ను తిరిగి పొందొచ్చు లేదా మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

భార్యతో కలిసి అకౌంట్ ఓపెన్ చేస్తే లాభాలు:

ఇద్దరి పేర్లపై కలిపి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి అవకాశం.

సంవత్సరానికి రూ. 1,11,000 వరకు వడ్డీ ఆదాయం.

ప్రతి నెలా ₹9250 వరకు రెగ్యులర్ ఆదాయం.

ప్రీ-మెచ్యూరిటీ విత్‌డ్రావల్ షరతులు:

అకౌంట్ ఓపెన్ చేసిన 1 సంవత్సరం తర్వాత డబ్బు ఉపసంహరించుకోవచ్చు.

1 నుంచి 3 సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేస్తే మొత్తం డిపాజిట్‌పై 2% పెనాల్టీ.

3 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేస్తే 1% పెనాల్టీ మాత్రమే ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది రిస్క్ లేకుండా, నెలనెలా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. భద్రత, స్థిర ఆదాయం రెండూ కావాలంటే ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *