Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో కంగువా చిత్రం తెరకెక్కింది. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారు. ఇందులో భాగంగా ముంబయిలో ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ మీట్ కు వచ్చిన హీరో మీడియాకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు ఆయన సారీ చెప్పారంటే?
అసలేం జరిగిందంటే..?
ముంబయిలో ఏర్పాటు చేసిన ‘కంగువా’ సినిమా ప్రెస్ మీట్(Kanguva Press Meet)కు నటుడు సూర్య వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ట్రాఫిక్ సమస్య వల్ల సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో ఆలస్యంగా వచ్చిన ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పారు. ‘లేట్ గా వచ్చినందుకు ఐ యామ్ రియల్లీ సారీ. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందని సాకులు చెప్పను. మీ టైమ్ కు నేను విలువ ఇస్తాను. కానీ దీన్ని నేను నియంత్రించలేకపోయాను. నన్ను క్షమించండి.’ అని సూర్య మీడియాకు సారీ చెప్పారు.
What a star
Superstar #Suriya apologised for the late arrival and the ruckus incident for his bodyguard.
Its just 2 days and #Kanguva coming on the screens @Suriya_offl https://t.co/VxjfdIkTIh pic.twitter.com/ggNMwy5ViV
— Ashwani kumar (@BorntobeAshwani) November 12, 2024
కంగువా క్లైమాక్స్ లో ట్విస్టులు
మరోవైపు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కంగువా- 1 కోసం ఎంతలా ఎదురు చూశారో, రెండో భాగం కోసం అంతకంటే ఎక్కువ ఆత్రుతతో వెయిట్ చేస్తారని తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. చివరలో ఆశ్చర్యకరమైన ప్రశ్నలుంటాయని.. పార్ట్ 2లోనే వాటికి సమాధానం దొరుకుతుంది. అని చెప్పుకొచ్చారు.
10వేల స్క్రీన్స్ లో కంగువా
‘కంగువా’ మూవీ 10 వేల స్క్రీన్స్‌లో స్క్రీనింగ్ కానుంది. దక్షిణాదిన 2500 కంటే ఎక్కువ.. ఉత్తరాదిన 3,500 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. నవంబర్ 14న మొత్తం 10 వేల స్క్రీన్లలో భారీ స్థాయిలో కంగువా (Kanguva Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సూర్య ఆరు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ (Disha Pathani) హీరోయిన్గా నటించింది. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషించారు.






