మంచు విష్ణు(Vishnu Manchu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన ‘కన్నప్ప(Kannappa)’ చిత్రంపై ప్రముఖ తమిళ నటుడు సూర్య(Tamil Actor Suriya) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా విష్ణుకు శుభాకాంక్షలు(Wishes) తెలుపుతూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. దీనిపై విష్ణు మంచు సోషల్ మీడియా(SM) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంచు విష్ణుకు సూర్య ఒక పూల బొకే(Flower bouquet)తో పాటు అభినందన సందేశం పంపారు. “ఈ అద్భుతమైన మైలురాయికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ విష్ణు. నీ ప్యాషన్, కష్టం, నమ్మకం ఫలించాయి. ఎన్నో హృదయాలను హత్తుకునే మూవీ తీసినందుకు గర్వంగా ఉంది” అని సూర్య తన సందేశంలో పేర్కొన్నారు.
Actor @Suriya_offl wished @iVishnuManchu & Team #Kannappa for their success 😍 pic.twitter.com/9ItiQTjUbt
— Studio Frames (@StudioFramesIn) July 1, 2025
బిగ్ బ్రదర్ సూర్య! మీ సందేశానికి ధన్యవాదాలు: విష్ణు
విష్ణు స్పందిస్తూ, “బిగ్ బ్రదర్ సూర్య! మీ సందేశానికి ధన్యవాదాలు(Thanks). స్ఫూర్తి కోసం నేను ఎప్పుడూ మీ సినిమాలనే చూస్తాను. మీ నుంచి ఇలాంటి సందేశం రావడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటి” అని బదులిచ్చారు. కాగా అంతకుముందు ‘కన్నప్ప’ మూవీ పైరసీ(Kannappa Piracy) బారిన పడిందని విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రియమైన సినీ ప్రియులారా, కన్నప్పపై పైరసీ దాడి జరుగుతోంది. ఇప్పటికే 30,000 పైగా చట్టవిరుద్ధమైన లింకులను తొలగించాం. ఇది చాలా బాధాకరం. పైరసీ అంటే దొంగతనమే. దయచేసి దానిని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాను ఆదరించండి” అని ప్రేక్షకులను కోరారు. కాగా ఈ మూవీ విడుదలైన 4 రోజుల్లో రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి.
Big brother @Suriya_offl ! Thank you so much for the flowers and more so the message.
I continue to look at your work for inspiration and today getting such a message from you is one of the biggest highlight. Love you my big brother. pic.twitter.com/C59GiUyGCM
— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025






