New Rules: దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఏంటో తెలుసా?

దేశవ్యాప్తంగా నేటి (జులై 1) నుంచి పలు కీలక నిబంధనలు(New Rules) అమలులోకి రానున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు నుంచి క్రెడిట్ కార్డు(Credit Cards)ల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకూ అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య పన్ను చెల్లింపుదారులు, SBI, HDFC, ICICI వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిబంధనల ప్రకారం మంగళవారం నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్(Aadhar) వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానించాలి..

ఇక ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్(Driving License) లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులతో పాన్ కార్డు(Pan Card) పొందే వీలుండేది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని CBDT స్పష్టం చేసింది. ఈ నిబంధన పాటించని వారి పాన్ కార్డులు డి-యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా, రైల్వే తత్కాల్ టికెట్ల(Railway Tatkal tickets)ను బుక్ చేసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి కానుంది. దీనితో పాటు, జులై 15 నుంచి ఆన్‌లైన్ లేదా కౌంటర్లలో కొనుగోలు చేసే అన్ని రైలు టికెట్లకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇప్పటికే పెరిగిన రైలు టికెట్ ధరలు(Train New Fares) కూడా అమలులోకి వచ్చాయి.

How much will Vande Bharat ticket cost? Revised train ticket fares from  July 1 - INDIA - GENERAL | Kerala Kaumudi Online

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అదనంగా 46 రోజులు

ఇక ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు చివరి తేదీని జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దీనివల్ల ఉద్యోగులకు తమ రిటర్నులను ఫైల్ చేయడానికి అదనంగా 46 రోజుల సమయం లభించింది. SBI ఎంపిక చేసిన ప్రీమియం కార్డులతో విమాన టికెట్లు కొనుగోలు చేస్తే అందించే AIR యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తోంది. అలాగే, నెలవారీ బిల్లులపై చెల్లించాల్సిన కనీస మొత్తం (MAD) లెక్కింపు విధానంలోనూ మార్పులు తీసుకురానుంది.

ITR Filing 2025: THESE individuals are exempt from paying income tax.  Should they file ITR? - Money News | The Financial Express

బ్యాంకు ఏటీఎంలో ఉచిత లావాదేవీలపై

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లించినా లేదా ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్‌లపై రూ. 10,000కు మించి ఖర్చు చేసినా 1% లావాదేవీ రుసుము విధిస్తుంది. ICICI బ్యాంక్ కూడా ATM లావాదేవీలతో సహా పలు సేవా ఛార్జీలను సవరిస్తోంది. ICICI ATMలలో 5 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత నగదు విత్‌డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ.23 ఛార్జ్ పడుతుంది. ఇతర బ్యాంకుల ATMలలో మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి.

ATM withdrawals to get costlier from May 1 as RBI approves fee hike

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *