Shekhar Kammula: క్రేజీ న్యూస్.. ఆ స్టార్ హీరోయిన్‌తో శైఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ!

ప్రముఖ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తన తాజా చిత్రం ‘కుబేర(Kubera)’ విజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ చిత్రం జూన్ 20, 2025న విడుదలై, రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్(Box Office) వద్ద సత్తా చాటింది. ఇప్పుడు ఆయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు, ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రుత్‌ప్రభు(Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సమంత ఈ చిత్రంలో ఒక బలమైన, భావోద్వేగ పాత్రలో కనిపించనున్నారని, శేఖర్ మార్క్ హ్యూమన్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే కథనం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

శేఖర్-సామ్ కాంబో వస్తే మ్యాజిక్ ఖాయం

కాగా హీరోయిన్ సమంత(Samantha)తో సినిమా చేయాలని మొదటి నుంచి శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నారట. లేడీ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్‌(Lady oriented backdrop)లో ఈ సినిమా రాబోతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని టీటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే శేఖర్ కమ్ముల ఫీల్-గుడ్ సినిమాలకు, సమంత నటనా ప్రతిభకు మ్యాజిక్ ఖాయమంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Ruth Prabhu: 'Shaakuntalam' actress turns investor for new  packaged foods brand

భావోద్వేగ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది..

కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర(Kubera)’ చిత్రం 2025 జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా సామాజిక థ్రిల్లర్‌గా, శేఖర్ కమ్ముల గుర్తింపు పొందిన భావోద్వేగ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ రికార్డును నమోదు చేసింది.

Kuberaa: Sekhar Kammula breaks down what worked and what didn't in the  Dhanush starrer

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *