12 ఏళ్ల తర్వాత రిలీజ్‌.. విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

కోలీవుడ్ హీరో విశాల్‌ (Vishal) ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’ (MadhaGajaRaja). షూటింగ్‌ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఇటీవల తమిళంలో సంక్రాంతి పండుగ సమయంలో ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ధకాలం తర్వాత విడుదలైనా కూడా ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో తమిళ్ లో వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీని తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేశ్‌ మదగజరాజ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.(MadhaGajaRaja Telugu Trailer). మరి హీరో విశాల్, ఆర్య, సంతానం కలిసి నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్, ఆర్య, సోనూసూద్, సంతానం కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇందులో విశాల్ కు జోడీగా వరలక్ష్మ శరత్ కుమార్, అంజలి నటించారు. ఇక ట్రైలర్ చివరలో విశాల్ సిక్స్ ప్యాక్ లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం తెలుగులో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *