నేను ప్రతిసారీ తగ్గను.. విశ్వక్ సేన్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన లేటెస్ట్ సినిమా ‘లైలా (Laila)’. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో నటుడు పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏకంగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమించమని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ‘బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ (Boycott Laila)’ మాత్రం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  తాజాగా దీనిపై విశ్వక్‌ సేన్‌ మరోసారి స్పందించారు.

రెండు సార్లు ఆలోచించలేను

లైలా నుంచి నేడు రిలీజ్ కానున్న ఓ పాట (Laila Song) పోస్టర్లను విశ్వక్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దాని కింద ఇలా క్యాప్షన్ జోడించారు. ‘‘నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్‌.. నా సినిమాకు సంబంధించింది మాత్రమే. సినిమాల పోస్టర్స్‌, పోస్ట్‌లను షేర్‌ చేసే ప్రతిసారీ రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉంది సోనూ మోడల్‌.. ఫిబ్రవరి 14వ తేదీనన మీ ముందుకు వస్తున్నాడు’’ అని రాసుకొచ్చారు.

ప్రతిసారీ తగ్గను

మరోవైపు లైలా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నెట్టింట జరుగుతున్న ట్రెండింగ్ గురించి కూడా విశ్వక్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ నేను ప్రతిసారీ తగ్గను. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు’’ అని విశ్వక్ (Vishwak Sen Tweet Today) ఈసారి కాస్త గట్టిగా చెప్పుకొచ్చారు.

బాయ్ కాట్ లైలా

ఇక లైలా సినిమా సంగతికి వస్తే.. విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. తన పాత్రకు సంబంధించి మాట్లాడుతూ.. 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) చేసిన కామెంట్స్  రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ  నేపథ్యంలోనే బాయ్ కాట్ లైలా అంటూ నెట్టింట ట్రెండ్ మొదలైంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *