తెలంగాణ(Telangana)ను డ్రగ్స్ కుంపటి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఈ విషయంలో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని FDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు(Dil Raju) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని(International Anti-Drug Day) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు నటులు రామ్ చరణ్ (Ram Charan) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పాల్గొని డ్రగ్స్‌పై తమ గళం విప్పారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేశారు.
అప్పుడే సమాజానికి బలమైన సందేశం
దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ, మలయాళ చిత్ర పరిశ్రమ(Malayalam film industry)లో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే(Expulsion) నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. “అక్కడ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే, వారిని పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలంగాణ ఎఫ్‌డీసీ(Telangana FDC) తరపున తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నేను కోరేది ఒక్కటే. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత వ్యక్తులను ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిషేధించాలి. అప్పుడే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చించి, తెలుగు సినిమాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఇది మనందరి కర్తవ్యమని దిల్ రాజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అంతా ప్రతిజ్ఞ(Promise) చేయాలని పిలుపునిచ్చారు.
Like Malayalam Film Industry, We will discuss in Telugu Film Industry and ban those who take Drugs – Dil Raju, TGFDC chairman pic.twitter.com/V8s0l3t52I
— Naveena (@TheNaveena) June 26, 2025






