బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన ప్రియుడు, వ్యాపారవేత్త టోనీ బేగ్ (tony beig)ను ఆమె పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమెరికా లాస్ ఏంజెలెస్లోనీ ఓ స్టార్ హోటల్లో గత వారాంతంలోనే వీరి వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైందట.
View this post on Instagram
స్విట్జర్లాండ్ కు నర్గీస్-టోనీ
ఇక ఈ కొత్త జంట నేరుగా అమెరికా నుంచి స్విట్జర్లాండ్ వెళ్లినట్లు సమాచారం. ఈ ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు నర్గీస్ (Nargis Marriage) తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఈ జంటకు పెళ్లయిందని బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ జంట తమ వివాహం జరిగినట్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
![]()
హరిహర వీరమల్లులో ఛాన్స్
టోనీ బేగ్ కశ్మీర్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్. అతడి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. 2022 నుంచి నర్గీస్, టోనీ డేటింగ్ లో ఉన్నట్లు ఈ బ్యూటీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక నర్గీస్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్ తో ఈ బ్యూటీ నటించిన రాక్ స్టార్ (Rockstar) ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ భామ తాజాగా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)లోనూ కనిపించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది.






