
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ మూవీని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.
చిరు-ఓదెల మూవీ అప్డేట్
ఇదే బ్యానర్ లో నాని (Nani) నటుడు ప్రియదర్శితో ‘కోర్టు (Court)’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని కోర్టు విశేషాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా గురించి కూడా ఓ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది (2026) థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
హింసలోనే శాంతి
ఇక చిరు-ఓదెల (Chiranjeevi Srikanth Odela Movie)సినిమా అనౌన్స్ మెంట్ తోనే ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ తోనే ఇదొక మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్పేశారు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితోనే ‘ది ప్యారడైజ్ (The Paradise)’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక చిరు-ఓదెల మూవీ ఉంటుంది. అంటే విశ్వంభర తర్వాత మెగాస్టార్ అనిల్ రావిపూడితో సినిమా చేయడం పక్కా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…