Mana Enadu : ‘క్రిస్మస్ (Christmas) రోజునే నా కొడుకు చనిపోయాడు’ అంటూ నటి త్రిష (Actress Trisha) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. త్రిషకు కొడుకేంటి.. అసలు పెళ్లి ఎప్పుడైందని కంగుతింటున్నారు.. అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏంటంటే..?
త్రిష పెంపుడు శునకం జోరో (Dog Zorro) ఇవాళ తెల్లవారుజామున మరణించింది. గత 12 ఏళ్లుగా ఈ డాగ్ త్రిష వద్దే ఉంటోంది. దానికి ఈ బ్యూటీ జోరో అనే పేరు పెట్టుకుంది. అప్పటి నుంచి జోరోను త్రిష తన కన్నబిడ్డలా చూసుకుంటోంది. అప్పుడప్పుడు తన షూటింగ్స్ కు కూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తరచూ జోరో దిగిన ఫొటోలు షేర్ చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ తెల్లవారుజామున జోరో ప్రాణాలు కోల్పోయింది.
— Trish (@trishtrashers) December 25, 2024
ఈ క్రమంలో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘క్రిస్మస్ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకూ అందుబాటులో ఉండను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.







