Pakistan: పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో విషాదం.. గాల్లోకి కాల్పులతో ముగ్గురి మృతి

పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు(Independence Day celebrations in Pakistan) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశ ఆర్థిక రాజధాని కరాచీ(Karachi)లో సంబరాల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా ఎనిమిదేళ్ల బాలిక సహా ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ నగరం తుపాకీ మోతలతో, బాణసంచా చప్పుళ్లతో దద్దరిల్లింది.

95 injured in aerial firing in Karachi on eve of Pakistan's Independence Day  — police | Arab News

ఈ క్రమంలో అజీజాబాద్ బ్లాక్-8 ప్రాంతంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారిపైకి ఓ తూటా దూసుకువచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో కోరంగి ప్రాంతంలో స్టీఫెన్(Stephen) అనే వ్యక్తిపైకి తూటా దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని మరో ప్రాంతంలోనూ ఇలాంటి కాల్పులకే ఓ వృద్ధుడు బలైనట్లు అధికారులు తెలిపారు.

New Year celebratory firing leaves 24 people injured in Karachi

ఈ ఘటనల్లో మొత్తంగా 64 మందికి బుల్లెట్ గాయాలైనట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. క్షతగాత్రులను నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లియాఖతాబాద్, కోరంగి, లయారి, నార్త్ నాజిమాబాద్ సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ కాల్పుల ఘటనలు నమోదయ్యాయి.

Related Posts

Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Parliament Monsoon Sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. పలు కీలక బిల్లులకు ఆమోదం

భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of Parliament) వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిశాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఈ సమావేశాలు అనేక కీలక అంశాలపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. సమావేశాలు 120…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *