Mana Enadu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా ఇన్స్పిరేషన్ కలిగించే స్టోరీలు, మోటివేషనల్ కోట్స్ ను పోస్టు చేస్తోంది. ఇక ఇటీవల కూడా తన ఫొటోలు షేర్ చేసి అభిమానులను ఖుష్ చేసింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సామ్ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సామ్ బేబీ బంప్ ఫొటోస్

తాజాగా నెట్టింట సమంత బేబీ బంప్ (Samantha Baby Bump Photos) తో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత ప్రెగ్నెంట్ ఎప్పుడైందని ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ‘సిటాడెల్- హనీ బన్నీ (Samantha Citadel)’ ప్రమోషన్స్ లో సామ్ నార్మల్ గానే కనిపించింది కదా ఇప్పటికిప్పుడు బేబీ బంప్ ఎక్కడి నుంచి వచ్చిందని తెగ షాకైపోతున్నారు. ఇక కొందరేమో ఏదైనా సినిమాలో తన పాత్ర కోసం చేసిన ఫొటోషూట్ కు సంబంధించినవి అని అనుకుంటున్నారు.
అసలు సంగతి అదీ
కానీ సామ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల్లో ఏ మూవీలోనూ ప్రెగ్నెంట్ లేడీ పాత్ర చేయడం లేదని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ బేబీ బంప్ ఫొటోస్ ఎక్కడివని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది. అవి రియల్ ఫొటోస్ కాదని.. ఏఐ జెనరేటెట్ పిక్చర్స్ అని. నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అనంతరం తనకు తల్లి కావాలని ఉందని, ఆ ఫీలింగ్ ను ఎప్పటికైనా అనుభవించాలని ఉందంటూ సామ్ అప్పట్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బేబీ బంప్ ఫొటోలు చూసిన వారంతా ఈ విషయాన్నే గుర్తు చేసుకుంటున్నారు.







