Mana Enadu: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ(A public sector airline of India) ఎయిర్‌ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికాకు నడుపుతున్న విమాన సర్వీసులను రద్దు చేసింది. నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు దాదాపు 60 విమాన సర్వీసుల (Cancellation of flights)ను రద్దు చేసినట్టు ఎయిర్‌ఇండియా ప్రకటించింది. నిర్వహణ, ఎయిర్ క్రాఫ్ట్ సమస్య(Aircraft problems)ల కారణంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో రద్దు చేసిన విమాన సర్వీసుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
విమాన ప్రయాణికుల(Air passengers)తో పాటు కస్టమర్లకు అందించిన సమాచారం మేరకు ఎయిర్‌ఇండియా సంస్థ ద్వారా నడుపుతున్న ఇతర విమనాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆపేసినట్లు తెలిపింది. ఢిల్లీ-చికాగో మార్గంలో 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ మార్గంలో 28, ఢిల్లీ-SFO మధ్య 12 విమాన సర్వీలు, ముంబై-న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ-నెవార్క్ మార్గంలో సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్టు పేర్కొంది.
Aviation news