అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా బాసటగా నిలిచింది. ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు మధ్యంతర చెల్లింపుగా అందించనున్నట్లు తాజాగా వెల్లడించింది. అలాగే ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడి (Passengers)కి కూడా తక్షణ ఆర్థిక అవసరాల నిమిత్తం ఈ మేరకు రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా తమ అధికారిక ఎక్స్(X)లో ప్రకటన విడుదల చేసింది.
Air India tweets, “Air India will provide an interim payment of Rs 25 lakh or approximately 21,000 GBP each to the families of the deceased and to the survivor, to help address immediate financial needs. This is in addition to the Rs 1 crore or approximately 85,000 GBP support… pic.twitter.com/UdwNJgsBbA
— ANI (@ANI) June 14, 2025
రూ. కోటి సహాయానికి ఇది అదనం: ఎయిర్ ఇండియా
టాటా సన్స్(Tata Son’s) ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి సహాయానికి ఇది అదనమని ఎయిర్ ఇండియా(Air India) స్పష్టం చేసింది. “ఇటీవల జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంఘీభావం తెలుపుతోంది. ఈ అత్యంత క్లిష్ట సమయంలో క్షేత్రస్థాయిలో మా బృందాలు సాధ్యమైనంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నాయి” అని ప్రకటనలో పేర్కొంది.
కోలుకుంటున్న మృత్యుంజయుడు
కాగా గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI171) కుప్పకూలింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉండగా, ఒక ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేశ్ అనే ఏకైక ప్రయాణికుడి ఆరోగ్యం(Health) వేగంగా మెరుగుపడుతోందని సమాచారం.








