నందమూరి బాలకృష్ణ(Balakrishna)- మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”(Akhanda 2). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు, టాలెంటెడ్ విలన్ ఆది పినిశెట్టి ఈ సినిమాకు ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
“అఖండ 2” మేకింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదని, భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా, విజువల్‌గా అన్ని విధాలుగా ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయట. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
తాజాగా ఫిలింసర్కిల్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మేకర్స్ ఓ ప్రత్యేక పాటను ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారట . ఈ స్పెషల్ సాంగ్‌ను తదుపరి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ ఈ పాటలో భాగంగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు. నిర్మాతలుగా రామ్ అచంటా మరియు గోపినాథ్ అచంటా వ్యవహరిస్తుంన్నారు. బోయపాటి మార్క్ మాస్ మేకింగ్, బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ మ్యూజిక్ ఈ సారి ‘తాండవం’ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.






