Samantha: సమంతకు భారీ షాక్.. కోట్ల రూపాయల మోసంతో అంతా తలక్రిందులు!!

స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు సంబంధించిన ఎన్నో విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సెలెక్టివ్‌ సినిమాలు చేసుకుంటూనే, వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టి పెడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్.. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో వెబ్ సిరీస్‌ కూడా ఓకే చేసింది. కానీ ఈ సినిమా విషయంలో అనుకోని కష్టం వెంటాడుతోందట.

రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ని రాజ్ అండ్ డీకే పర్యవేక్షణలో నెట్‌ఫ్లిక్స్ వారు రూపొందించనున్నారు. అయితే ఈ సిరీస్ ప్రారంభం కంటే ముందే దీని ఆర్థిక లావాదేవీల్లో మోసం జరిగినట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ ఒకరు బడ్జెట్‌ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, కోట్ల రూపాయల స్కామ్‌ జరిగిందనే టాక్ బయటకొచ్చింది. దీంతో సీన్ రివర్స్ అయింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆగిపోయింది.

ఇది జరిగి చాలా రోజులే అయినా ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నెట్‌ఫ్లిక్స్ టీం, మేకర్స్‌తో దీనిపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కే అవకాశం లేనట్టే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘తుంబాడ్’ ఫేం రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహించాల్సి ఉంది. సో.. ఒకరకంగా సమంత ఫ్యాన్స్ కి ఇది చేదు వార్తనే అని చెప్పుకోవాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *