Actor Sriram: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

కోలీవుడ్(Kollywood) హీరో శ్రీరామ్(Sriram) డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ కావడం తమిళ సినీ ఇండస్ట్రీ(Tamil film industry)లో తీవ్ర కలకలం రేపింది. తెలుగు(Telugu) ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయనను చెన్నై పోలీసులు(Chennai Police) ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. AIADMK మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్(Drugs Purchase) కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్ట్ జరిగింది. వివరాల్లోకి వెళితే, చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్(Chennai Narcotics Intelligence) యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి(Rajiv Gandhi Government Hospital)కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

APలోని తిరుపతికి చెందిన శ్రీకాంతే ఈ శ్రీరామ్

అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి సుమారు 2 గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌(Prasad)తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా శ్రీరామ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. APలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్(Srikanth) సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్‌ (Sriram)గా మార్చుకుని, తొలుత చిన్న పాత్రలు పోషించారు. ‘రోజా పూలు(Roja poolu)’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *