అఖిల్, జైనబ్ రిసెప్షన్ లో తమన్ గిఫ్ట్ హైలెట్.. అఖిల్ రియాక్షన్ వేరే లెవల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన వేడుక అఖిల్ అక్కినేని(Akhil Akkineni) – జైనబ్(Zainab Ravdjee) పెళ్లి సంబరాలే. జూన్ 6న ఈ జంట పెళ్లి పీటలెక్కగా, జూన్ 8న రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.

అఖిల్, జైనబ్ వివాహ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖులే కాదు, రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా నాగార్జునకు ఎంతో సన్నిహితురాలైన నటి టబు ప్రత్యేక ఆకర్షణగా మారారు. పెళ్లి వేడుకల్లోని అద్భుత దృశ్యాలు అభిమానులనే కాదు, నెటిజన్లను కూడా ఆకట్టుకున్నాయి.

ఇక రిసెప్షన్ సందర్భంగా ఓ స్పెషల్ క్లిప్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. స్టేజ్‌పై శ్రీకాంత్, ఆయన కొడుకు రోషన్, సంగీత దర్శకుడు తమన్(Thaman) కలిసి నవదంపతులను ఆశీర్వదించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా తమన్ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్‌ను అఖిల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. “ఇదేం గిఫ్ట్ రా బాబు ఈ టైంలో?” అన్నట్టుగా నవ్వారు. అఖిల్ క్రికెట్‌ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారన్నది తెలిసిందే. గ్రౌండ్‌లోకి దిగితే భారీ సిక్సర్లతో అదరగొడతారు.

ప్రస్తుతం అఖిల్, శ్రీలీల జంటగా “లెనిన్” అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే శ్రీలీల గత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో, ఈ చిత్రం అఖిల్ కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

Related Posts

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). మానసిన దివ్యాంగులతో స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న తెరకెక్కించారు. జూన్‌ 20న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా…

శుభం ఓటీటీ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్..

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఆశించినదానికంటే మంచి కలెక్షన్లు సాధించిన చిత్రం ‘శుభం’(Shubham) సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మే 9న విడుదలై ప్రేక్షకులను అలరించింది. సెటైరికల్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను మిళితం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *