సర్‌ప్రైజ్‌.. ముందుగానే ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్. రెండేళ్ల తర్వాత అఖిల్ ‘ఏజెంట్‌ (Agent)’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో అఖిల్‌ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో సందడి చేశారు.

అఖిల్ అభిమానులకు సర్ ప్రైజ్

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు అవుతోంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో (Agent Movie) చూడాలని అఖిల్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఏజెంట్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా.

ఒక్కరోజు ముందుగానే

ఎట్టకేలకు మార్చి 14వ తేదీ నుంచి సోనీలివ్‌ (SONY Liv) వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. అయితే, అఖిల్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఒకరోజే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్‌ వేదికగా అఖిల్ ఏజెంట్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.  ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *