
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
RC16 ఓటీటీ రైట్స్
తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు ఓటీటీ సంస్థలు Rc16 చిత్రాన్ని భారీ ధరకు దక్కించుకునేందుకు ప్రయత్నించాయట. అయితే వీటిలో సోనీలివ్ (Sony Liv) సంస్థ మేకర్స్ కు రికార్డు ధర ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేకర్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix)తో డీల్ ఫైనింగ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్. మరి ఈ డిజిటల్ రైట్స్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాల్సి ఉంది.
చెర్రీ లుక్ వైరల్
ఇక ఆర్సీ16 విషయానికొస్తే ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు విశ్వ ఫ్యామిలీతో కలిసి చెర్రీ దిగిన ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇందులో చెర్రీ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.