
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (UK Lifetime Achievement Award)’ను ప్రకటించింది. ఈ అవార్డును మార్చి 19వ తేదీన ఆ దేశ పార్లమెంటులో మెగాస్టార్ కు అందజేయనున్నారు. ఈ పురస్కారంపై చిరు స్పందిస్తూ.. యూకే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు చిరుకు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్
ఇక చిరంజీవి సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర (Vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ భామ త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ తర్వాత చిరు.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)తోనూ ఓ సినిమా ప్లాన్ చేశారు.