అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) రెండో కుమారుడు, టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్-జైనాబ్ రవడ్జీ(Akhil-Zainab Ravadji)ల పెళ్లి రిసెప్షన్(Reception) గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడిస్(Annapurna Studies)లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు(Film & Political Celebrities) భారీగా తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కాగా అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవడ్జీ మెడలో ఈనెల 6న తెల్లవారుజామున 3 గంటలకు మూడుముళ్లు వేసి ఒక్కటయ్యారు. ఈ పెళ్లివేడుక జూబ్లిహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. ఇక నిన్న అఖిల్-జైనాబ్‌ల రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.
అఖిల్-జైనాబ్‌ల రిసెప్షన్ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమట్ రెడ్డి, ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

ఇక సినీ ప్రముఖులలో మహేశ్ బాబు-నమ్రత(Maheshbabu-Namrata), రామ్ చరణ్-ఉపాసన(Ram Charan-Upasana), విక్టరీ వెంకటేశ్, అల్లు అరవింద్, కిచ్చా సుదీప్, అడివి శేష్, నాని, నిఖిల్, కన్నడ నటుడు యశ్(Yash), తమిళ్ నటుడు సూర్య(Suriya), యంగ్ దర్శకులు సుకుమార్(Sukumar), బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ఈ రిసెప్షన్‌కు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించి శుభాకంక్షలు తెలిపారు.
వీరితో పాటు మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈ వివాహ విందులో పాల్గొని సందడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది.






