‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తన తర్వాతి ప్రాజెక్టుతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు(Kartheek Dandu) డైరెక్షన్లో నాగ చైతన్య 24వ చిత్రం తెరకెక్కుతోంది. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా పాన్ ఇండియా(Pan India) రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్(Pre-Look Poster)ను ఇది వరకే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల నాగచైతన్య మేకోవర్ లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ గురించి మరో న్యూస్ బయటికొచ్చింది. ఇంతకీ అదేంటంటే..?
#NC24 is Vrusha Karma ( tentative ) 🔥🔥
A Mythological thriller
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 25, 2025
ట్రెజర్ హంటింగ్ నేపథ్యంలో..
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ‘NC24’ మూవీలో చైతూ ఇదివరెప్పుడూ చేయని రోల్లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి ఓ న్యూస్ సినీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ట్రెజర్ హంటింగ్(Tresure Hunting) నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుందని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్లోనే ఇది భారీ చిత్రమని తెలిపారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ పేరును ‘వృష కర్మ(Vrusha Karma)’గా ఆయన రివీల్ చేసినట్లుగా ఓ వీడియో వైరలవుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ మూవీలో చైతూ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Choudari) హీరోయిన్గా నటిస్తోంది.






