టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్లో అడుగుపెట్టిన ప్రతీసారీ నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించా. అవకాశాలు కల్పించిన BCCI, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, నా జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు” అని పుజారా రాసుకొచ్చాడు.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field – it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025
ద్రవిడ్ వారసుడిగా గుర్తింపు
కాగా పుజారా(Pujara) భారత్ తరఫున 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7,195 రన్స్ సాధించారు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్(Test Cricket)లో ఆయన అత్యధిక స్కోరు 206 నాటౌట్. అలాగే, 5 వన్డే మ్యాచ్‌లు ఆడి 51 రన్స్ చేశారు. 2023లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(World Test Championship) ఆయన చివరి టెస్ట్ మ్యాచ్. టెస్ట్ క్రికెట్లో తన రక్షణాత్మక బ్యాటింగ్‌తో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వారసుడిగా ‘ది వాల్’గా పేరొందిన పుజారా.. జట్టు టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు.
అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాలు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్(England)లలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో ఆయన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాలు అందించాడు. సౌరాష్ట్ర(Saurashtra) తరఫున దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లోనూ పుజారా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఆయన స్థిరమైన స్కోరర్‌గా రాణించాడు. IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(KIXP) వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు. రిటైర్మెంట్తో పుజారా తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తెరదించారు. ఆయన నిష్క్రమణ భారత క్రికెట్లో ఒక శకానికి ముగింపు పలికినట్లయింది.కాగా పుజారాకు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని, భారత క్రికెట్‌కు అతడి సేవలు కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తాయని మాజీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలు పేర్కొన్నారు.
One of Indian cricket’s most resolute and admired Test specialists, @cheteshwar1, has announced his retirement from all forms of the game.
Relive one of his prolific knocks against Australia at Ranchi.#ThankYouPujji pic.twitter.com/1zb22SPWN6
— BCCI (@BCCI) August 24, 2025






