గ్లామర్‌తో హీటెక్కిస్తోన్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే!

ముంబైకు చెందిన మంజరి ఫడ్నిస్(Manjari Fadnnis), ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అల్లరి నరేష్(Allari Naresh ) హీరోగా నటించిన ఈ సినిమాలో మంజరి అల్ట్రా గ్లామరస్ లుక్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఏడాదిలో వచ్చిన ‘శుభప్రదం’ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా, సంపూర్ణ ట్రెడిషనల్ గెటప్‌లో కనిపించి అందరి మనసులు గెలుచుకుంది.

‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమా బాక్సాఫీస్ హిట్ ని అందుకుంది. ఆ తరువాత ‘రాజా ఇంకోసారి’, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నటించిన ‘శక్తి’ చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించింది. అయితే ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్‌గా మారిపోయాయి. దీంతో ఆమె తెలుగు చిత్రసీమకు కొంత దూరమైంది.

తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన ఈ ముద్దు గుమ్మ.. బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ‘గ్రాండ్ మస్తీ’, ‘సర్వ్ మంగళ్ సావధాన్’, ‘కిసి కిసికో ప్యార్ కరూన్’, ‘నిర్దోష్’ లాంటి హిందీ సినిమాల్లో నటించి మళ్లీ కెరీర్ కొనసాగించింది. సినిమాలకి తోడు, మంజరి ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె బొద్దుగా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో స్లిమ్ ఫిగర్‌తో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన మంజరి, ఇప్పుడు కొత్త గెటప్‌తో సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

మంజరి ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలకంటే వెబ్ కంటెంట్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *