Mana ENadu : ‘పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్ప’.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హవానే నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్పరాజ్ మేనియానే కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఫ్యాన్స్ కోసం బన్నీ సర్ ప్రైజ్
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ మేనియా కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీల్లోని థియేటర్ల వద్ద అల్లు అర్జున్ భారీ కటౌట్లు కనిపిస్తున్నాయి. రేపటి గ్రాండ్ సెలబ్రేషన్స్ కు బన్నీ ఆర్మీ (Allu Arjun Army) రంగం సిద్ధం చేసింది. అయితే మరో 24 గంటల్లో సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ తన అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందట. అదేంటంటే..?
అక్కడ రచ్చ రచ్చే
ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య సినిమా (Sandhya Theater) థియేటర్ వద్ద రద్దీ మామూలుగా ఉండదు. చాలా సినిమాల హీరోలు ఇక్కడి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఈ థియేటర్ లో తమ సినిమా స్క్రీనింగ్ కు కూడా హాజరవుతుంటారు. స్టార్ హీరోల సినిమా రిలీజ్ రోజున ఈ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఇక తమ అభిమాన హీరో ఆ థియేటర్ కు వస్తున్నాడంటే వారిని ఆపడం ఎవరి తరం కాదు. డిసెంబరు 5వ తేదీ గురువారం కూడా అలాంటి సీనే సంధ్య థియేటర్ వద్ద మనం చూడబోతున్నాం. ఎందుకంటే..?
సంధ్య థియేటర్ కు బన్నీ
పుష్ప-2 సినిమా స్పెషల్ షోలు (Pushpa 2 Special Shows) మరికొన్ని గంటల్లో షురూ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ సంధ్య థియేటర్ లో స్పెషల్ షోకు హాజరు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీతో పాటు పుష్ప-2 టీమ్ కూడా ఈ సినిమా హాల్ లో సందడి చేయబోతున్నారట. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు.
అభిమాన సంద్రంగా సంధ్య థియేటర్
సాధారణ రోజుల్లోనే సంధ్య థియేటర్ వద్ద సినీ అభిమానులను ఆపడం కాస్త కష్టం. ఇక అల్లు అర్జున్ వస్తున్నాడంటే అక్కడి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది. అయితే బన్నీ వస్తే పోలీసులు థియేటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారని సమాచారం. ఈ విషయంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఇక పుష్ప-2 సినిమా సంగతికి వస్తే ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil), జగదీశ్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరిసింది.






