Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీసుల విచారణకు బయల్దేరారు. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద నుంచి కారులో ఆయన ఠాణాకు వెళ్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరే సమయంలో ఆయన సతీమణి స్నేహ, కుమార్తె అర్హ ఆయనకు సెండాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డి కాస్త ఎమోషనల్ గా కనిపించారు.
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun leaves from his residence in Jubilee Hills
According to Sources, Hyderabad police have issued a notice to actor Allu Arjun, asking him to appear before them in connection with the Sandhya theatre incident pic.twitter.com/S4Y4OcfDWz
— ANI (@ANI) December 24, 2024
ఠాణాకు అల్లు అర్జున్
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)లో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్‌లో విచారణకు రావాల్సిందిగా పేర్కొన్న విషయం తెలిసిందే. నోటీసులపై తన లీగల్ టీమ్‌తో చర్చించిన అల్లు అర్జున్.. ఇవాళ ఉదయం ఠాణాకు బయల్దేరారు. బన్నీతో పాటు అతడి లీగల్ టీమ్ కూడా ఆయన వెంట వెళ్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ జరగనున్నట్లు తెలిసింది. ఏసీపీ రమేష్ కుమార్‌తో పాటు సెంట్రల్ జోన్ డీఎస్పీలు అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నారు.
ఠాణా వద్ద భారీ బందోబస్తు
తొక్కిసలాట ఘటనపై పోలీసులు విడుదల చేసిన వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత బన్నీ నిర్వహించిన ప్రెస్ మీట్ (Allu Arjun Press Meet) కు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ రాక సందర్భంగా చిక్కడపల్లి పీఎస్ వద్దకు భారీగా ఆయన అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారో బందోబస్తు ఏర్పాటు చేశారు.






